Corona: కరోనా.. అదే ఉద్ధృతి.. అంతే కేసులు..! 

తాజా వార్తలు

Updated : 05/08/2021 12:30 IST

Corona: కరోనా.. అదే ఉద్ధృతి.. అంతే కేసులు..! 

తాజా నమోదైన కరోనా కేసులు ఎన్నంటే..?

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 16,64,030 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 42,982 మందికి పాజిటివ్‌గా తేలింది. నిన్న మరో 533 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3.18 కోట్లకు చేరగా.. 4,26,290 మంది మృత్యుఒడికి చేరుకున్నారని గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

క్రియాశీల కేసులు మళ్లీ నాలుగు లక్షల మార్కును దాటి కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం 4,11,076 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. తాజాగా 41,726 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.09 కోట్లకు చేరాయి. ప్రస్తుతం క్రియాశీల రేటు 1.29 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 97.37 శాతానికి చేరింది. మరోపక్క నిన్న 37,55,115 మందికి టీకా అందింది. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసులు సంఖ్య 48.93 కోట్లుగా ఉంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని