India Corona: తగ్గిన కరోనా కేసులు.. మరణాలు

తాజా వార్తలు

Updated : 09/08/2021 10:42 IST

India Corona: తగ్గిన కరోనా కేసులు.. మరణాలు

97.4 శాతానికి పెరిగిన రికవరీ రేటు

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొద్దిమేర తగ్గింది. తాజాగా కొత్త కేసులు, మరణాల్లో తగ్గుదల కనిపించింది. ఆదివారం 13,71,871 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 35,499 మందికి పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజుతో పోల్చితే కేసులు 9 శాతం మేర క్షీణించాయి. అందుకు నిర్ధారణ పరీక్షల సంఖ్యలో తగ్గుదల కూడా కారణంగా కనిపిస్తోంది. నిన్న మరో 477 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3.19 కోట్లకు చేరగా.. 4.28లక్షల మంది మరణించారని సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

క్రియాశీల కేసుల సంఖ్య 4,02,188(1.26 శాతం)గా ఉంది. నిన్న 39 వేల మంది కోలుకున్నారు. మొత్తంగా వైరస్‌ను జయించినవారి సంఖ్య 3.11 కోట్లకు చేరింది. రికవరీ రేటు 97.40 శాతానికి పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో పంపిణీ అయిన డోసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. నిన్న 16,11,590 మంది టీకాలు వేయించుకున్నారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని