కరోనా మరణాలు@ 84

తాజా వార్తలు

Published : 08/02/2021 10:10 IST

కరోనా మరణాలు@ 84

24 గంటల్లో 11,831 కొత్త కేసులు

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలోనే ఉంది. ఆదివారం 5,32,236 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 11,831 కొత్త కేసులు వెలుగుచూశాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,08,38,194కి చేరింది. అలాగే గత కొన్ని రోజులుగా వైరస్ మృతుల సంఖ్య 100 దిగువన నమోదు కావడం ఊరటనిస్తోంది. గడిచిన 24 గంటల్లో 84 మంది మృత్యు ఒడికి చేరగా..ఇప్పటివరకు 1,55,080 మంది ఈ మహమ్మారికి బలయ్యారని సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

నిన్న 11,904 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా 1,05,34,505 మంది వైరస్‌ నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఇక, రివకరీ రేటు 97.20 శాతానికి పెరగ్గా..క్రియాశీల రేటు 1.37శాతానికి తగ్గింది. క్రియాశీల కేసుల సంఖ్య 1,48,606కి పడిపోయింది. ఇంకోవైపు, ఫిబ్రవరి ఏడు నాటికి 58,12,362 మంది పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బంది టీకాలు వేయించుకున్నారని కేంద్రం వెల్లడించింది.

ఇవీ చదవండి:

కరోనా టీకా: దూసుకుపోతున్న భారత్

కంప్యూటర్‌తో కొవిడ్ మరణాలు ముందే గుర్తింపు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని