International Tiger Day: నాలుగేళ్లలో పులుల సంఖ్య రెట్టింపు: మోదీ

తాజా వార్తలు

Updated : 29/07/2021 16:38 IST

International Tiger Day: నాలుగేళ్లలో పులుల సంఖ్య రెట్టింపు: మోదీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: పులుల ఆవాసాల సంరక్షణకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ట్వీట్లు చేసిన మోదీ, ఆవాసాల సంరక్షణతో పాటు పులులకు అనుకూలమైన ఎకోసిస్టమ్‌ను కాపాడేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. పులుల సంరక్షణలో భాగంగా స్థానిక ప్రజలను మమేకం చేయడాన్ని ప్రధాన అంశంగా గుర్తించి వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్లు మోదీ తెలిపారు. భారతీయులు సనాతన కాలం నుంచీ, ఈ గ్రహంపై ఉండే అన్ని జీవ జాతులతో ఘర్షణ లేకుండా జీవిస్తూ వస్తున్నారని అన్నారు. విశ్వవ్యాప్తంగా ఉన్న పులులో 70 శాతం భారత్‌లోనే ఉన్నాయన్న మోదీ అంతర్జాతీయ పులుల దినోత్సవం పురస్కరించుకొని వాటి సంరక్షణకు పాటుపడుతున్న వారికి అభినందనలు తెలిపారు. దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాల పరిధిలో పులుల అభయారణ్యాలు 51 ఉండగా 2018 లెక్కల ప్రకారం పులుల సంఖ్య గణనీయంగా పెరిగాయని తెలిపారు. సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌ ఒడంబడికకు కట్టుబడి భారత్‌ నాలుగేళ్లలో పులుల సంఖ్య రెట్టింపు అయ్యేందుకు కృషి చేసిందని మోదీ అన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని