95 రోజుల్లోనే 13 కోట్ల టీకాల పంపిణీ!
close

తాజా వార్తలు

Published : 21/04/2021 14:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

95 రోజుల్లోనే 13 కోట్ల టీకాల పంపిణీ!

దిల్లీ: కరోనా వైరస్‌ టీకా పంపిణీలో భారత్‌ మరో మైలు రాయిని అధిగమించింది. అత్యంత వేగంగా 95 రోజుల్లోనే 13 కోట్ల డోసుల పంపిణీని పూర్తి చేసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. యూఎస్‌లో ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి 101 రోజులు పట్టగా.. చైనాలో 109 రోజులు సమయం పట్టినట్లు తెలిపింది.

‘వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా భారత్‌ 95 రోజుల్లో 13 కోట్ల డోసుల పంపిణీ పూర్తి చేసుకుంది. తాజా గణాంకాల ప్రకారం మంగళవారం ఇచ్చిన వాటితో కలిపి మొత్తం 13.01కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశాం. 8 రాష్ట్రాల్లో టీకా ప్రక్రియ 59.33 శాతంగా నమోదైంది. అందులో మహారాష్ట్ర, రాజస్థాన్‌, యూపీ, గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, కేరళ ఉన్నాయి’ అని కేంద్రం పేర్కొంది. కాగా, గడిచిన 24 గంటల్లో 29.90 లక్షల డోసులు పంపిణీ చేశారు. మరోవైపు మే 1 నుంచి దేశంలో 18 ఏళ్లు పైబడిన వారికి టీకా ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని