హ్యాకర్ల కట్టడి‌ దిశగా భారత్‌..?

తాజా వార్తలు

Published : 12/03/2021 14:44 IST

హ్యాకర్ల కట్టడి‌ దిశగా భారత్‌..?

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల చైనా హ్యాకర్లు ముంబయిలోని పవర్‌గ్రిడ్‌ను హ్యాక్‌ చేసిన విషయం గుప్పుమనడంతో భారత్‌ అప్రమత్తమైంది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు మొదలుపెట్టింది. ఈ మేరకు సరికొత్త పాలసీని తయారు చేస్తోంది. ఇది అమల్లోకి వస్తే హువావే, జెడ్‌టీఈ వంటి సంస్థలు భారత్‌లో పరికరాలు విక్రయించడం కష్టతరంగా మారుతుంది. భారత టెలికమ్యూనికేషన్‌ డిపార్ట్‌మెంట్‌ లైసెన్సింగ్‌ విధానంలో కొన్ని  నిబంధనలను సవరించింది. దీంతో ఇప్పుడు టెలికమ్‌ సంస్థలు ఏదైనా పరికరాలు  కొనుగోలు చేసే సమయంలో రక్షణ, జాతీయ భద్రతా అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. దేశం నమ్మదగిన సరఫరాదారుల వద్ద నుంచే వీటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.  వాస్తవానికి గతేడాది కేబినెట్‌ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఈ ప్రతిపాదనలు చేసింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించింది. టెలికమ్‌ ఉత్పత్తులను నమ్మదగినవి, నమ్మలేనివి అనే రెండు విభాగాలుగా వర్గీకరిస్తారు.

ఈ కొత్త నిబంధన జూన్‌ 15 నుంచి అమల్లోకి రానుంది. ఆ తర్వాత నుంచి ‘నమ్మలేని’ కేటగిరిలోకి వచ్చే కంపెనీల పరికరాలను కొనుగోలు చేయడం అత్యంత కష్టంగా మారుతుంది. ఇప్పటికే అమెరికాలో పలు ఆరోపణలు ఎదుర్కొన్న హువావే, జెడ్‌టీఈల నుంచి భారత్‌లోని టెలికం దిగ్గజాలు పరికరాలు కొనగోలు చేయలేవు. ప్రస్తుతం భారత్‌లో ప్రభుత్వ రంగానికి చెందిన టెలికం కంపెనీలతో సహా పలు ప్రైవేటు సంస్థలు కూడా ఈ చైనా కంపెనీల నుంచి పరికరాలను కొనుగోలు చేస్తున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని