Ladakh: సరిహద్దుల్లో చైనాకు దీటుగా..
close

తాజా వార్తలు

Published : 18/06/2021 23:30 IST

Ladakh: సరిహద్దుల్లో చైనాకు దీటుగా..

మౌలిక వసతుల అభివృద్ధి దిశగా ముమ్మర చర్యలు

దిల్లీ: సరిహద్దుల వద్ద చైనాకు దీటుగా భారత్‌ మౌలిక వసతులను అభివృద్ధి చేస్తోంది. తూర్పు లద్ధాఖ్‌లో చైనాతో ఘర్షణాత్మక వైఖరి నెలకొన్న వేళ సరిహద్దుల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం కేంద్రం ముమ్మర చర్యలు చేపట్టింది. అందులో భాగంగా అవసరమైన సమయంలో బలగాలు, సైనిక వ్యవస్థల తరలింపునకు వీలుగా.. రహదారులు, సొరంగ మార్గాలు, వంతెనల నిర్మాణాన్ని సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్‌ఓ) యుద్ధప్రాతిపదికన చేపడుతోంది. భద్రతా దళాలను, ఆయుధ వ్యవస్థలను సరిహద్దులకు వేగంగా తరలించేందుకు భౌగోలిక అవరోధాలను, వాతావరణ పరిస్థితులను లెక్కచేయకుండా పలు అభివృద్ధి పనులు చేపడుతోంది. అందులో భాగంగా రహదారులు, సొరంగ మార్గాలు, వంతెనలను యుద్ధప్రాతిపదికన నిర్మిస్తోంది. 

తూర్పు లద్ధాఖ్‌లోని హాట్‌స్ప్రింగ్‌, గోగ్రా, దెమ్‌చోక్‌ నుంచి బలగాలను ఉపసంహరించుకోవడానికి డ్రాగన్‌ నిరాకరిస్తూ.. వాస్తవాధీనరేఖ వెంబడి మౌలిక వసతులను అభివృద్ధి చేసుకుంటోంది. రహదారులు, సైనిక బలగాల వసతి సౌకర్యాలు, హెలిప్యాడ్లను సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌ సైతం సరిహద్దుల్లో మౌలిక వసతుల అభివృద్ధి దిశగా చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఏడాది కాలంలో బీఆర్‌ఓ 1200 కిలోమీటర్ల మేర రోడ్దు ఫార్మేషన్‌ పనులు పూర్తిచేసింది. మరో 2,850 కి.మీ. మేర సర్ఫేజింగ్‌ పనులు పూర్తయ్యాయి. చైనాతో ఉన్న 4643 కి.మీ. సరిహద్దులో వ్యూహాత్మకంగా కీలకమైన 73 రహదారుల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. 

ఏడాది కాలంలో 45 రహదారుల నిర్మాణాలను పూర్తిచేసిన బీఆర్‌ఓ.. మరో ఏడింటిని వచ్చే సంవత్సరం మార్చి నాటికి పూర్తి చేయాలని భావిస్తోంది. ఇదే సమయంలో సంవత్సర కాలంలో బీఆర్‌ఓ 74 శాశ్వత వంతెనలు, 33 బెయిలీ వంతెనలను పూర్తిచేసింది. ఫలితంగా అరుణాచల్‌ ప్రదేశ్‌లోని యాంగ్‌చే వంటి మారుమూల ప్రాంతాలకు అనుసంధానం సాధ్యమైంది. సరిహద్దులతో అనుసంధానాన్ని మరింత మెరుగుపర్చడం కోసం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సరిహద్దు రహదారుల సంస్థ నిర్మించిన 12 రహదారులను గురువారం ప్రారంభించారు. వీటిలో అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కిమిన్‌ పోటిన్‌ 20 కిలోమీటర్ల డబుల్‌ లైన్‌ రహదారితోపాటు మరో 9 రహదారులు ఉన్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని