భారత్‌: మళ్లీ 11వేల పైన కొత్తకేసులు

తాజా వార్తలు

Published : 17/02/2021 10:11 IST

భారత్‌: మళ్లీ 11వేల పైన కొత్తకేసులు

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. క్రితం రోజు 10వేల దిగువకు పడిపోయిన కొత్త కేసులు.. తాజాగా మళ్లీ 11వేలకు చేరాయి. గడిచిన 24 గంటల్లో మరో 11,610 వైరస్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,37,320కి చేరింది. 

ఇక గత 24 గంటల్లో మరో 11,833 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,06,44,858గా ఉంది. రికవరీ రేటు 97.33శాతానికి పెరిగింది. మరోవైపు దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 2శాతానికి దిగవనే కొనసాగుతుండటం ఊరటనిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,36,549 యాక్టివ్‌ కేసులుండగా.. క్రియాశీల రేటు 1.25శాతానికి పడిపోయింది. వైరస్‌ కారణంగా మరో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్పటివరకు 1,55,913 మంది కరోనాకు బలయ్యారు. 

89లక్షల మందికి టీకాలు..

ఇదిలా ఉండగా.. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతోంది. నిన్న 2,76,943 మంది టీకా తీసుకున్నారు. దీంతో బుధవారం ఉదయం నాటికి మొత్తంగా 89,99,230 మందికి వ్యాక్సిన్‌ అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని