Corona: కాస్త తగ్గిన కొత్త కేసులు, మరణాలు
close

తాజా వార్తలు

Published : 10/05/2021 09:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: కాస్త తగ్గిన కొత్త కేసులు, మరణాలు

దిల్లీ: కరోనా రక్కసి కాటుకు యావత్‌ దేశం చిగురుటాకులా విలవిల్లాడుతోంది. లక్షల మందిపై మహమ్మారి విరుచుకుపడుతూనే ఉంది. వేల మందిని పొట్టనబెట్టుకుంటోంది. 24 గంటల వ్యవధిలో 3.66లక్షల మంది కొవిడ్ బారినపడ్డారు. అంతక్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు దాదాపు 35వేలకు పైగా తగ్గడం గమనార్హం. అయితే నిర్ధారణ పరీక్షలు తగ్గడం వల్లే కేసుల సంఖ్య తక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఆదివారం కేవలం 14.7లక్షల మందికే వైరస్‌ పరీక్షలు చేశారు. అంతక్రితం రోజున 18.6 లక్షల మంది టెస్టులు చేయించుకున్నారు.

* ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 14,74,606 మంది కరోనా పరీక్షలు చేయించుకోగా.. 3,66,161 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.2కోట్లకు చేరింది. 

* ఇదే సమయంలో 3754 మంది కరోనాతో మృత్యుఒడికి చేరుకున్నారు. దీంతో వైరస్‌ ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు 2,46,116 మందిని కొవిడ్‌ బలితీసుకుంది. మరణాల రేటు 1.09శాతంగా ఉంది.  

* అయితే కొత్త కేసులతో పాటు రికవరీలు కూడా ఎక్కువగానే ఉంటుండటం కాస్త సానుకూల పరిణామం. గడిచిన 24 గంటల్లో 3,53,818 మంది కరోనాను జయించారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1.86కోట్లకు చేరగా.. రికవరీ రేటు 82.15శాతానికి పెరిగింది.

* ప్రస్తుతం 37,45,237 మంది వైరస్‌కు చికిత్స తీసుకుంటుండగా.. క్రియాశీల రేటు 16.76 శాతంగా ఉంది.

17కోట్లు దాటిన వ్యాక్సినేషన్‌..

దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నెమ్మదిగా సాగుతోంది. చాలా చోట్ల వ్యాక్సిన్ల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం కేవలం 6.89లక్షల మందికే టీకాలు ఇచ్చారు. దీంతో ఇప్పటివరకు 17.01కోట్ల మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని