Oxford ఎన్నికల్లో భారత సంతతి విద్యార్థిని ఘన విజయం

తాజా వార్తలు

Published : 21/05/2021 10:56 IST

Oxford ఎన్నికల్లో భారత సంతతి విద్యార్థిని ఘన విజయం

విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా అన్వీ భుటానీ

లండన్‌: ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఉపఎన్నికల్లో భారత సంతతి విద్యార్థిని అన్వీ భుటానీ ఘన విజయం సొంతం చేసుకుంది. 2021-22 సంవత్సరానికి సంబంధించి జరిగిన ఈ ఎన్నికల్లో.. ఆక్స్‌ఫర్డ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ అధ్యక్షురాలిగా గెలుపొందింది. ఒక భారతీయ విద్యార్థిని ఈ పదవిని దక్కించుకోవడం ఇది రెండోసారి.

గత ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన భారత విద్యార్థిని రష్మీ సమంత్‌ చేసిన కొన్ని సామాజిక మాధ్యమాల పోస్ట్‌లు వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆమె ఆ పదవి నుంచి వైదొలగడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ ఎన్నికల్లో ఆక్స్‌ఫర్డ్‌ విద్యార్థి సంఘాల ఎన్నికల చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఓటింగ్‌ నమోదవ్వడం విశేషం. అలాగే మొత్తం 11 మంది అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు. ఇంత మొత్తంలో అభ్యర్థులు పోటీ చేయడం కూడా ఇదే తొలిసారి. అన్వీ ప్రస్తుతం వర్సిటీకి అనుబంధంగా ఉన్న మ్యాగ్‌డాలెన్‌ కళాశాలలో హ్యూమన్‌ సైన్సెస్‌లో పీజీ చదువుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని