ఇండో-యూఎస్‌ ఆర్మీ ‘యుద్ధ అభ్యాస్‌’ ప్రారంభం

తాజా వార్తలు

Published : 08/02/2021 21:18 IST

ఇండో-యూఎస్‌ ఆర్మీ ‘యుద్ధ అభ్యాస్‌’ ప్రారంభం

జైపూర్: భారత్‌, అమెరికా ఆర్మీ దళాలు సంయుక్తంగా నిర్వహించే ‘యుద్ధ అభ్యాస్‌’ 16వ విడత శిక్షణ కార్యక్రమాలు సోమవారం రాజస్థాన్‌లో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. భారత ఆర్మీ 170వ ఇన్‌ఫాంట్రీ దళ కమాండర్‌ ముకేశ్‌ భన్వాలా నేతృత్వంలో పశ్చిమ సెక్టార్‌లోని మహాజన్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో ఈ వ్యాయామ ప్రక్రియ మొదలైంది. ఈ సందర్భంగా యూఎస్‌ దళానికి ముకేశ్‌ భన్వాలా స్వాగతం పలికినట్లు రక్షణశాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్‌ కల్నల్‌ అమితాబ్‌ శర్మ ఓ ప్రకటనలో వెల్లడించారు. దళాల మధ్య ఆలోచనలు పంచుకోవడం సహా ఒకరికొకరు కార్యాచరణ అనుభవాల నుంచి నేర్చుకోవలసిన అవసరాన్ని భన్వాలా ప్రత్యేకంగా వెల్లడించారు. 

ఈ ప్రక్రియలో భాగంగా యూఎస్‌ ఆర్మీకి చెందిన అధునాతన లైట్‌ హెలికాప్టర్‌ డబ్ల్యూఎస్‌ఐ రుద్ర, ఎంఐ 17, చినూక్స్‌, స్ట్రైకర్‌ వాహనాలతో పాటు.. భారత్‌ ఆర్మీకి చెందిన ఇన్‌ఫాంట్రీ కంబాట్‌ వాహనాలు ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 21 వరకు ఈ విన్యాసాలు కొనసాగనున్నాయని తెలిపారు. కాగా ఇటీవల భారత్‌, ఫ్రాన్స్‌ దేశాలకు చెందిన వైమానిక దళాలు సంయుక్తంగా ఐదు రోజుల పాటు డ్రిల్‌ నిర్వహించిన వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభం కావడం గమనార్హం. 

ఇదీ చదవండి

ఒక్క ఫోన్‌ కాల్‌ 12 ప్రాణాలుTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని