వడ్డీ రేట్లు యథాతథం: నిర్మలా సీతారామన్‌

తాజా వార్తలు

Updated : 01/04/2021 13:21 IST

వడ్డీ రేట్లు యథాతథం: నిర్మలా సీతారామన్‌

దిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లు యథాతథంగా ఉంటాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. పొదుపు పథకాలపై వడ్డీరేట్లను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది.  పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌) వడ్డీరేటుపై 0.7 శాతం, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ (ఎన్‌ఎస్‌సీ) వడ్డీరేటుపై 0.9 శాతం, సేవింగ్స్‌ డిపాజిట్లపై 0.5 శాతం  తగ్గిస్తున్నట్టు పేర్కొంది. 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి (ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 30) సంబంధించి ప్రభుత్వం తాజాగా మార్పులు చేసినట్లు ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. వడ్డీ రేట్లను 1.1 శాతం వరకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే... నిన్న జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఈమేరకు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. 2020-2021 చివరి త్రైమాసికం ప్రకారమే వడ్డీరేట్లు ఉంటాయని పేర్కొన్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని