Privacy policy: వాట్సాప్‌కు కేంద్రం నోటీసులు

తాజా వార్తలు

Published : 19/05/2021 19:45 IST

Privacy policy: వాట్సాప్‌కు కేంద్రం నోటీసులు

దిల్లీ: వాట్సాప్‌ తీసుకొచ్చిన నూతన ప్రైవసీ పాలసీపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. నూతన ప్రైవసీ పాలసీలో చేపట్టిన మార్పులు.. డేటా భద్రతను బలహీనపరచడమే కాకుండా భారతీయుల హక్కులు, ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు ఐటీ మంత్రిత్వ శాఖ వాట్సాప్‌కు నోటీసులు జారీ చేసింది. అభ్యంతరాలపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సంతృప్తికర సమాధానం రాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

సమాచార మార్పిడి కోసం చాలా మంది భారతీయులు వాట్సాప్‌పై ఆధారపడుతున్నారని, ఐరోపాలోని వినియోగదారులతో పోలిస్తే భారతీయుల పట్ల వాట్సాప్‌  అనుసరిస్తున్న వివక్ష ధోరణిని సైతం కేంద్రం నోటీసుల్లో ప్రస్తావించినట్లు తెలిసింది. వాట్సాప్‌ తన కొత్త ప్రైవసీ పాలసీకి మే15ను గడువుగా విధించగా.. అనంతరం అమలును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అమలును వాయిదా వేసినంత మాత్రన ప్రజల ప్రయోజనాలను గుర్తించినట్లు కాదని ఐటీ మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. నూతన ప్రైవసీని వెనక్కి తీసుకోవాలని నోటీసుల్లో పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని