JEE Advanced 2021: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష తేదీ ఖరారు

తాజా వార్తలు

Updated : 26/07/2021 22:33 IST

JEE Advanced 2021: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష తేదీ ఖరారు

దిల్లీ: దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు తేదీ ఖరారైంది. అక్టోబర్‌ 3న ఈ పరీక్ష నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రకటించారు. జులై 3న జరగాల్సి ఉన్నప్పటికీ కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష అక్టోబర్‌ 3న జరుగుతుందని మంత్రి ట్విటర్‌లో వెల్లడించారు. కొవిడ్‌ నిబంధనలను పూర్తి స్థాయిలో పాటిస్తూ ఈ పరీక్షను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఖరగ్‌పూర్‌ ఐఐటీ నిర్వహించనుంది. 

మరోవైపు, జేఈఈ మెయిన్‌ చివరి విడత పరీక్షల తేదీలు ఇటీవల మారిన విషయం తెలిసిందే. ఆగస్టు 26, 27, 31, సెప్టెంబర్‌ 1,2 తేదీల్లో చివరి విడత పరీక్షలు జరుగుతాయని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఇటీవల వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని