రెండు నెలల్లో 10 కోట్ల మందికి టీకాలు

తాజా వార్తలు

Published : 20/03/2021 01:26 IST

రెండు నెలల్లో 10 కోట్ల మందికి టీకాలు

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్‌, టీకా పంపిణీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగా 100 రోజుల ప్రణాళికను రూపొందించారు. ఈ వ్యవధిలోనే పది కోట్ల మందికి కొవిడ్‌ టీకాలు అందించాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. తాజాగా కేవలం 58 రోజుల్లోనే ఈ లక్ష్యాన్ని సాధించినట్లు బైడెన్‌ ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 11 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు యూఎస్‌ సీడీసీ వెల్లడించింది. బైడెన్‌ ప్రమాణ స్వీకారం నాటికి దేశంలో దాదాపు 2 కోట్ల డోసులను పంపిణీ చేయగా.. కేవలం రెండు నెలల్లోనే 10 కోట్ల మందికి టీకా ఇచ్చినట్లు సీడీసీ తెలిపింది. ఇప్పటివరకు అక్కడ 11 కోట్ల 57 లక్షల మంది వ్యాక్సిన్‌ తీసుకోగా.. 7 కోట్ల 54 లక్షల మందికి తొలి డోస్‌, మరో 4 కోట్ల మందికి రెండు డోసులు అందించినట్లు ప్రభుత్వం పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని