Kappa Variant: యూపీలో ‘కప్పా’ కేసు

తాజా వార్తలు

Updated : 10/07/2021 18:36 IST

Kappa Variant: యూపీలో ‘కప్పా’ కేసు

లఖ్‌నవూ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ల వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో కప్పా వేరియంట్‌కు చెందిన మరో కేసు వెలుగుచూసింది. దాంతో ఆ వేరియంట్ కేసులు మూడుకు చేరాయి. ‘ రాష్ట్రం నుంచి 72 నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌ కోసం దిల్లీకి పంపాం. 30 నమూనాల ఫలితాలు అందాయి. వాటిలో 27 డెల్టా వేరియంట్, 2 డెల్టా ప్లస్, 1 కప్పా రకం కేసులు బయటపడ్డాయి’ అని బీఆర్‌డీ వైద్య కళాశాలకు చెందిన డాక్టర్ అమరేశ్ సింగ్ వెల్లడించారు. 

ఇప్పటికే దేశంలో డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లు కలవరం పుట్టిస్తుండగా.. కొత్తగా కప్పా రకం వెలుగులోకి వచ్చింది. డెల్టా ప్లస్‌, కప్పా రకాలు రెండూ కూడా బి.1.617 వర్గానికి చెందినవే. ఈ రెండింటిని మొదట భారత్‌లోనే గుర్తించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని