కేజ్రీవాల్‌ను కలిసిన కరణం మల్లీశ్వరి 
close

తాజా వార్తలు

Updated : 23/06/2021 17:41 IST

కేజ్రీవాల్‌ను కలిసిన కరణం మల్లీశ్వరి 

దిల్లీ: దిల్లీ క్రీడా విశ్వ విద్యాలయ వీసీగా నియమితులైన తెలుగు దిగ్గజ వెయిట్‌లిఫ్టర్‌ కరణం మల్లీశ్వరి దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కలిశారు. ఆమెతో ఈ రోజు సమావేశమై, పలు అంశాలపై చర్చించినట్టు కేజ్రీవాల్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘దిల్లీ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ప్రారంభం కానుంది. మా పెద్ద కల సాకారమైంది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన కరణం మల్లీశ్వరి తొలి వీసీ కావడం ఎంతో గర్వకారణం’ అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా పాల్గొన్నారు.

దిల్లీలో స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పడిన తర్వాత తొలి వైస్‌ఛాన్స్‌లర్‌గా మల్లీశ్వరికే అవకాశం కల్పిస్తూ దిల్లీ ప్రభుత్వం నిన్న రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మల్లీశ్వరి 2000 సిడ్నీ ఒలింపిక్స్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌లో కాంస్య పతకం గెలిచిన సంగతి తెలిసిందే.

దేశం గర్వించదగిన ఛాంపియన్లను అందించండి: పవన్‌
తెలుగు తేజం కరణం మల్లీశ్వరి దిల్లీ క్రీడా వర్సిటీకి వీసీగా నియమితులు కావడం అందరం గర్వించదగిన విషయమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. దేశంలో క్రీడా రంగం అభ్యున్నతికి దోహదపడే విశ్వవిద్యాలయానికి తొలి వీసీగా బాధ్యతలు చేపట్టనున్న మల్లీశ్వరికి తమ పార్టీ తరఫున అభినందనలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నుంచి సిడ్నీ ఒలింపిక్స్‌ దాకా ఆమె సాగించిన ప్రస్థానం ఎంతో విలువైనదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎంతోమంది యువతులకు ఆమె స్ఫూర్తిగా నిలిచారని, ఇప్పుడు కీలక బాధ్యతల్లోనూ అందరికీ మార్గదర్శకంగా నిలుస్తారనే విశ్వాసం తనకు ఉందన్నారు. ఈ వర్సిటీ ద్వారా దేశం గర్వించదగిన ఛాంపియన్లను అందించాలని, గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్న ఆణిముత్యాల్లాంటి క్రీడాకారులను తీర్చిదిద్దాలని సూచించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని