కరోనా బారిన కుమారస్వామి‌

తాజా వార్తలు

Published : 17/04/2021 15:11 IST

కరోనా బారిన కుమారస్వామి‌

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి కరోనా బారిన పడ్డారు. తాజాగా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలినట్లు ఆయనే స్వయంగా ట్విటర్‌ ద్వారా శనివారం వెల్లడించారు. ‘నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నా. లక్షణాలు ఏమైనా ఉంటే స్వతహాగా ఐసోలేషన్‌లోకి వెళ్లండి’ అని కుమారస్వామి ట్వీట్‌లో విజ్ఞప్తి చేశారు. కాగా, కుమారస్వామి మార్చి 23న కరోనా టీకా తొలిడోసు వేయించుకున్నారు. ఇటీవల కొద్ది రోజుల కిందట మాజీ ప్రధాని, కుమారస్వామి తండ్రి దేవేగౌడ సైతం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని