కేరళలో జూన్‌ 16 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు
close

తాజా వార్తలు

Published : 07/06/2021 20:36 IST

కేరళలో జూన్‌ 16 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

తిరువనంతపురం: కేరళలో ఈ నెల 16 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. అత్యవసర సర్వీసులకు మినహాయింపు కల్పిస్తున్నట్లు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. 12, 13 తేదీల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు పేర్కొన్నారు. స్టేషనరీ, ఆభరణాలు, పాదరక్షలు, భవన నిర్మాణ సంబంధ పరికరాల లాంటి వస్తువుల అమ్మకాలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అనుమతించనున్నట్లు వివరించారు. లాక్‌డౌన్ కాలంలో బ్యాంకులు రోజు విడిచి రోజు పని చేస్తాయని తెలిపారు. ఈ నెల 17 నుంచి ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో నడుస్తాయన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని