Corona: కేరళలో ఆగని ఉద్ధృతి.. మళ్లీ 30వేలకు పైనే కొత్త కేసులు

తాజా వార్తలు

Published : 31/08/2021 23:35 IST

Corona: కేరళలో ఆగని ఉద్ధృతి.. మళ్లీ 30వేలకు పైనే కొత్త కేసులు

తిరువనంతపురం: కేరళలో ఎన్ని కట్టడి చర్యలు తీసుకుంటున్నా కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. మరోసారి 30వేలకు పైగానే కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కేరళలో 30,203 కేసులు వెలుగుచూశాయి. 115 మంది మృతిచెందారు. సోమవారం 19 వేల కేసులు నమోదవ్వగా.. మరుసటి రోజే 30వేలకు పైగా నమోదవడంతో అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సోమవారం 16.74 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు తాజాగా 18.86 శాతానికి పెరిగింది. కొత్తగా మరో 20,687 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో  ప్రస్తుతం 2,18,892 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తంగా చూస్తే కేరళలో 40లక్షలకుపైనే పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత కొన్ని వారాలుగా దేశంలో నమోదువుతున్న కొత్త కేసుల్లో సగానికి పైగా కేరళలోనే నమోదవుతుండటం గమనార్హం.

కేరళలో కొవిడ్‌ ఉగ్రరూపం కొనసాగుతుండటంతో అప్రమత్తమైన ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. ఈ నెల 30 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 10గంటల నుంచి ఉదయం 6గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తోంది. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యం వహించడం, కొవిడ్‌ ముప్పు ఉన్నవారి సంఖ్య ఎక్కువగా ఉండడం వంటివి కేరళలో వైరస్‌ విజృంభణకు కారణాలుగా అక్కడి అధికారులు పేర్కొంటున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని