మంత్రికి ఫోన్‌లో బెదిరింపులు!

తాజా వార్తలు

Updated : 13/07/2021 17:25 IST

మంత్రికి ఫోన్‌లో బెదిరింపులు!

తిరువనంతపురం: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ నిధుల దుర్వినియోగం వ్యవహారం బహిర్గతం అయిన తర్వాత తనకు బెదిరింపు ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయని కేరళ మంత్రి కె.రాధాకృష్ణన్‌ వెల్లడించారు. ఇటీవల ఓ వ్యక్తి తన కార్యాలయం ల్యాండ్‌లైన్‌ ఫోన్‌కు పలుమార్లు ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడన్నారు. మంగళవారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అక్రమాలను సహించబోమని తేల్చి చెప్పడంతో ఓ వ్యక్తి ఇటీవల ఫోన్‌ చేసి బెదిరించాడని పేర్కొన్నారు. పేద ప్రజల్ని మోసం చేసే వాళ్లను ఎప్పటికీ ఉపేక్షించబోమని మంత్రి స్పష్టంచేశారు. ఫోన్‌ చేసిన వ్యక్తి దుర్భాషలాడటంతో పాటు బెదిరించాడని, అలాంటి బెదిరింపులకు తాను భయపడబోనన్నారు. మరోవైపు, ఈ వ్యవహారంపై మంత్రి కార్యాలయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సీ ఎస్టీ సంక్షేమ నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిని ప్రభుత్వం విడిచిపెట్టదని ఇటీవల మంత్రి హెచ్చరించిన నేపథ్యంలో ఇలాంటి బెదిరింపు కాల్స్‌ రావడం గమనార్హం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని