డీకేకు కోపమొచ్చింది.. చెంప ఛెళ్లుమనిపించాడు!

తాజా వార్తలు

Updated : 10/07/2021 16:09 IST

డీకేకు కోపమొచ్చింది.. చెంప ఛెళ్లుమనిపించాడు!

బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. తన భుజంపై చేయి వేయడానికి ప్రయత్నించిన ఓ కార్యకర్త చెంప ఛెళ్లుమనిపించారు. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారడంతో డీకేను రౌడీతో పోల్చుతూ భాజపా విమర్శలు గుప్పించింది.

పార్టీ సీనియర్‌ నేతను పరామర్శించేందుకు శుక్రవారం డీకే శివకుమార్‌ మండ్య చేరుకున్నారు. పరామర్శ అనంతరం నడుస్తూ బయటకు వస్తుండగా ఓ కార్యకర్త భుజంపై చేయి వేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా ఆగి వెంటనే కార్యకర్తపై చేయి చేసుకున్నారు. ‘చనువు ఇస్తే చేయి వేయడానికి ప్రయత్నిస్తావా’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలోనూ తనతో సెల్ఫీ దిగేందుకు యత్నించిన వారి సెల్‌ఫోన్లను డీకే విసిరేసిన ఘటనలు ఉన్నాయి.

తాజా ఘటన నేపథ్యంలో డీకేపై భాజపా విమర్శలు చేసింది. సొంత పార్టీ కార్యకర్తపై నలుగురిలో ఈ విధంగా ప్రవర్తించడం సరికాదని, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక కూడా డీకే ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదని విమర్శించింది. ప్రజా జీవితంలో కార్యకర్తలతో ఎలా నడుచుకోవాలో కనీసం తెలీదా అంటూ మండిపడింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని