KSRTC: కర్ణాటక ఆర్టీసీ ట్రేడ్‌మార్క్‌ ఇకపై కేరళదే!
close

తాజా వార్తలు

Updated : 04/06/2021 21:40 IST

KSRTC: కర్ణాటక ఆర్టీసీ ట్రేడ్‌మార్క్‌ ఇకపై కేరళదే!

తిరువనంతపురం: కేఎస్‌ఆర్టీసీ అనగానే కర్ణాటక స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌ అని మనకు తెలుసు. తరచుగా కర్ణాటకకు చెందిన కేఎస్‌ఆర్టీసీ బస్సులు తెలుగు రాష్ట్రాల్లోకి రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే, కేరళ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌ను కూడా కేఎస్‌ఆర్టీసీ అనే పిలుస్తారు. కాగా.. ఈ రెండు రాష్ట్రాల మధ్య కేఎస్‌ఆర్టీసీ ట్రేడ్‌మార్క్‌ సంక్షిప్తపదంపై ఏడేళ్లుగా వివాదం నలుగుతోంది. తాజాగా దీనిపై ‘ది కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ పేటెంట్స్‌ డిజైన్‌ అండ్‌ ట్రేడ్‌మార్క్‌’ తీర్పు వెల్లడించింది. కేఎస్‌ఆర్టీసీ ట్రేడ్‌మార్క్‌ కేరళకే చెందుతుందని, సంక్షిప్త పదంతోపాటు రెండు ఏనుగుల చిహ్నంపై కేరళకే హక్కులు ఉంటాయని పేర్కొంది. కర్ణాటక రాష్ట్రం ఇకపై కేఎస్‌ఆర్టీసీ పదాన్ని ఉపయోగించకూడదని వెల్లడించింది.

ఇరు రాష్ట్రాల రోడ్‌ ట్రాన్స్‌పోర్టు శాఖకు ఘన చరిత్రే ఉంది. మొదట్లో కేరళ రోడ్‌ ట్రాన్స్‌పోర్టును ట్రావెన్‌కోర్‌ స్టేట్‌ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌గా వ్యవహరించేవారు. ఆ తర్వాత 1965 ఏప్రిల్‌ 1 నుంచి కేరళ స్టేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌గా పేరు మార్చారు. మరోవైపు కర్ణాటక ట్రాన్స్‌పోర్టు పూర్వం మైసూర్‌ గవర్న్‌మెంట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌గా ఉండేది.. 1973లో దాన్ని కర్ణాటక స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టుగా మార్చారు. అప్పటి నుంచి ఇరు రాష్ట్రాలు కేఎస్‌ఆర్టీసీ పేరుతోనే ప్రజారవాణా సేవలు అందిస్తున్నాయి. 

అయితే, కర్ణాటక రాష్ట్రం కేఎస్‌ఆర్టీసీ ట్రేడ్‌మార్క్‌ రిజిస్ట్రేషన్‌ కోసం 2014లో దరఖాస్తు చేసింది. ఈ సంక్షిప్త పదంపై హక్కులు తమవేనంటూ కేరళకు కర్ణాటక ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దీంతో కేరళ ప్రభుత్వం న్యాయ పోరాటానికి దిగింది. కేఎస్‌ఆర్టీసీ ట్రేడ్‌మార్క్‌ హక్కులు తమకే ఉంటాయని వాదించింది. ఎట్టకేలకు ఈ న్యాయపోరాటంలో కేరళ గెలుపొంది.. మేధో సంపత్తి హక్కులను దక్కించుకుంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని