పుణ్య స్నానానికి.. ‘కరోనా నెగెటివ్‌’ తప్పనిసరి..!

తాజా వార్తలు

Published : 26/03/2021 01:22 IST

పుణ్య స్నానానికి.. ‘కరోనా నెగెటివ్‌’ తప్పనిసరి..!

హరిద్వార్: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో హరిద్వార్‌లో నిర్వహించే కుంభమేళాకు వచ్చే యాత్రికులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేసుకొని రావాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు దేశంలో వైరస్‌ వ్యాప్తి అధికమవుతుండటంతో కుంభమేళా ఒక నెల పాటే జరగనుందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే కుంభమేళాను నెల రోజులు జరపడం ఇదే తొలిసారి అని చెప్పారు. ఈ క్రమంలో కుంభమేళాకు రానున్న భక్తులు హరిద్వార్‌కు చేరుకొనే 72 గంటల్లోపు కొవిడ్ టెస్టులు చేయించుకోవాలి.  కొవిడ్ నెగెటివ్‌ సర్టిఫికేట్‌ ఉన్నవారికి మాత్రమే కుంభమేళాకు అనుమతి ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే.. భక్తుల తాకిడి అధికమవుతుండటంతో కొవిడ్ టెస్టుల సంఖ్యను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. ఈ మేరకు యాత్రికులు కరోనా జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరుతున్నారు. 

కాగా ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ కుంభమేళా జరుగుతుందనే విషయం తెలిసిందే.. అయితే కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న దృష్ట్యా ఏప్రిల్‌ 1 నుంచి 30 వరకు మాత్రమే యాత్రికులు పుణ్యస్నానాలు ఆచరించాలని అధికారులు సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని