ఘనంగా లాలూ 74వ పుట్టినరోజు 
close

తాజా వార్తలు

Published : 11/06/2021 20:38 IST

ఘనంగా లాలూ 74వ పుట్టినరోజు 

పట్నా:  పశువుల దాణా కుంభకోణం కేసులో బెయిల్ పొందడంతో ఇటీవల జైలు నుంచి విడుదలైన రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ శుక్రవారం 74వ పుట్టినరోజును కుటుంబ సభ్యులతో జరుపుకొన్నారు. ఆయన బెయిల్‌ పొందినప్పటి నుంచి దిల్లీలోని ఆయన కుమార్తె మిసా ఇంట్లో నివాసముంటున్నారు. పుట్టినరోజు వేడుకల దృశ్యాలను మిసా భారతి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. లాలు ప్రసాద్‌ పెద్ద కుమారుడు.. తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ తన తండ్రి జన్మదినం సందర్భంగా పట్నాలో 74 మొక్కలు నాటారు. పట్నాలోని ఆర్జేడీ కార్యాలయంలో రక్తదానశిబిరం ఏర్పాటు చేయగా.. 200 యూనిట్ల రక్తాన్ని యువకులు దానం చేశారు. కొవిడ్‌ దృష్ట్యా, అనారోగ్యం కారణంగా ఆయని పట్నా తీసుకొచ్చేందుకు కుటుంబసభ్యులు నిరాకరిస్తున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని