ఈ క్రూరత్వానికి ముగింపు పలకండి

తాజా వార్తలు

Updated : 24/01/2021 05:24 IST

ఈ క్రూరత్వానికి ముగింపు పలకండి

ఏనుగు మరణంపై సుప్రీంకు లేఖ రాసిన న్యాయవాది

దిల్లీ: జంతువులపై క్రూరత్వానికి ముగింపు పలికేందుకు జోక్యం చేసుకోవాలంటూ సుప్రీంకోర్టు న్యాయవాది మాథ్యూస్‌ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. తమిళనాడులో ఏనుగుకు నిప్పటించిన తాజా ఘటనను ఆ లేఖలో ప్రస్తావించారు. మండుతున్న టైర్ ఒకదాన్ని ఏనుగు మీదకు విసిరేయడంతో అది గాయాలపాలైంది. తరవాత పరిస్థితి విషమించడంతో మరణించింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. 

‘తాజాగా వెలుగులోకి వచ్చిన విషాద ఘటన ప్రతి ఒక్కరిని తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. ఈ క్రూరత్వానికి ముగింపు పలికేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’ అని న్యాయవాది మాథ్యూస్ జె నెడుమ్‌పారా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డేకు లేఖ రాశారు. తన అభ్యర్ధనను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించాలని ఆయన కోరారు. 

నీలగిరి జిల్లా మసినకుడి ప్రాంతంలో జనావాసాల్లో తిరుగుతున్న ఆ ఏనుగును ఈ నెల 19న రిజర్వు ప్రాంతానికి తరలిస్తుండగా మరణించింది. అయితే ఏనుగు చెవి భాగంలో నిప్పుతో చేసిన గాయం ఉండటాన్ని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో టైరుకు నిప్పు పెట్టి దానిని ఏనుగు మీదకు విసిరే దృశ్యాలకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దాంతో అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. 

ఇవీ చదవండి:

విషమంగానే లాలూ..ఎయిమ్స్‌కు తరలింపు!Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని