కొవిడ్‌ టీకా: పుకార్లు వ్యాప్తిచేస్తే చర్యలు తప్పవ్  

తాజా వార్తలు

Published : 25/01/2021 18:27 IST

కొవిడ్‌ టీకా: పుకార్లు వ్యాప్తిచేస్తే చర్యలు తప్పవ్  

రాష్ట్రాలకు లేఖ రాసిన కేంద్రం 

దిల్లీ: కరోనా వైరస్ టీకాలకు సంబంధించి అవాస్తవాల వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. పుకార్లను ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం ఈ వదంతులను వ్యాప్తి చేస్తుంటారని, వాటి వల్ల ప్రజల్లో అనవసర అనుమానాలు కలుగుతాయని ఆ లేఖలో పేర్కొంది. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాల్సి ఉందని సూచించింది. గత వారం హోంశాఖ రాష్ట్రాలకు రాసిన లేఖలో..విపత్తు నిర్వహణ చట్టం, భారత శిక్షాస్మృతిలోని నిబంధనల గురించి ప్రస్తావించింది. కొవిడ్ టీకాకు సంబంధించి అవాస్తవమైన సమాచార వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఈ నిబంధనలను ఉపయోగించాలని కోరింది. 

సీరం సంస్థ తయారు చేసిన కొవిషీల్డ్, భారత్‌ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌కు భారత ప్రభుత్వం కొన్ని వారాల క్రితం అత్యవసర వినియోగం కింద అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనవరి 16న కేంద్రం మొదటి దశ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు 16 లక్షల పైచిలుకు వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు టీకాలు పొందారు. రెండో దశ ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోదీ సహా ముఖ్యమంత్రులు టీకాలు పొందనున్నట్లు సమాచారం. 

ఇదిలా ఉండగా..ఈ టీకాలు 110 శాతం సురక్షితమైనవని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వీజీ సోమాని గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి:

భారత్‌లో మోడెర్నా టీకా: టాటా ప్రయత్నాలు!

50వేల ట్రాక్టర్లతో రైతన్నల ర్యాలీ

 


 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని