గణతంత్ర ఘటనలపై మోదీ ఏమన్నారంటే..

తాజా వార్తలు

Published : 30/01/2021 17:33 IST

గణతంత్ర ఘటనలపై మోదీ ఏమన్నారంటే..

దిల్లీ: గణతంత్ర దినోత్సవం నాడు దేశ రాజధానిలో చోటుచేసుకున్న ఉద్రిక్త ఘటనలను యావత్‌ దేశం ముక్తకంఠంతో ఖండిస్తోంది. శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. అయితే దీనిపై మోదీ స్పందిస్తూ.. ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అన్నారు. 

వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో జనవరి 26 నాటి ఘటనను ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తారు. గణతంత్ర దినోత్సవం నాడు దిల్లీలో జరిగిన అల్లర్లు దురదృష్టకరమన్న విపక్షాలు.. దీనిపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అని చెప్పారని సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ మీడియాకు తెలిపారు. 

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో గత మంగళవారం కిసాన్‌ పరేడ్‌ పేరుతో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ రణతంత్రంగా మారిన విషయం తెలిసిందే. అనూహ్యంగా తమ వ్యూహాన్ని మార్చిన రైతులు.. చారిత్రక ఎర్రకోటను ముట్టడించారు. భద్రతాసిబ్బంది అడ్డుపెట్టిన బస్సులు, బారికేడ్లను ధ్వంసం చేసి ఎర్రకోటకు చేరుకున్నారు. కోటపై మతపరమైన జెండాతో పాటు రైతుల జెండాను ఎగురవేశారు. రైతులను పోలీసులు అడ్డుకునే క్రమంలో ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో 300 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. ఉద్రిక్తతల్లో ట్రాక్టర్‌ బోల్తా పడి ఓ యువ రైతు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ అల్లర్లకు తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన రైతులు.. ఇదంతా విద్రోహ శక్తుల కుట్ర అని ఆరోపిస్తున్నాయి. 

ఇవీ చదవండి..

మా ప్రభుత్వం ఫోన్‌కాల్‌ దూరంలోనే: మోదీ

దిల్లీ సరిహద్దుల్లో ఇంటర్నెట్‌ సేవలు బంద్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని