China: కలిసిమెలిసి ఉండాలి.. గొడవ పడకూడదు!
close

తాజా వార్తలు

Updated : 09/06/2021 15:37 IST

China: కలిసిమెలిసి ఉండాలి.. గొడవ పడకూడదు!

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌-చైనాలు సహకరించుకోవాలని, పరస్పరం గొడవ పడకూడదని దిల్లీలోని చైనా దౌత్యవేత్త సున్‌ వుయిడాంగ్‌ పేర్కొన్నారు. సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆకాంక్షించారు. ఇరు దేశాల సంబంధాల్లో  సరిహద్దు వివాదాన్ని కేవలం ఒక భాగంగానే చూడాలన్నారు.  ‘‘చాలా దేశాల మధ్య  అభిప్రాయభేదాలు ఉండటం సర్వసాధారణం. సరిహద్దు వివాదాలు కొనసాగుతున్నవే. వాటికి ద్వైపాక్షిక సంబంధాల్లో తగిన స్థానం ఇవ్వాలి. చర్చలు, సంప్రదింపులతోనే సరిహద్దు వివాదాల పరిష్కారం సాధ్యమవుతుందని బీజింగ్‌ విశ్వసిస్తోంది. అదే సమయంలో మా దేశ సార్వభౌమత్వం, రక్షణ విషయంలో రాజీపడేది లేదు. భారత్‌-చైనాలు పరస్పరం గౌరవించుకోవాలి. ఇరుపక్షాలు సమదృష్టితో చూసుకోవాలి. సరైన మార్గంలో సమస్యలను పరిష్కరించుకోవాలి’’ అని పేర్కొన్నారు.

సున్‌ వుయిడాంగ్‌ మంగళవారం భారత్‌కు చెందిన యువతతో సమావేశం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు చెందిన దాదాపు 23వేల మంది విద్యార్థులు గతేడాది కరోనా కారణంగా స్వదేశానికి వచ్చారు. వారు చదువుల కోసం ఇప్పుడు చైనాకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నా.. ఆ దేశం అనుమతించడంలేదు. దీనిపై సున్‌ను ప్రశ్నించగా.. తాను కచ్చితమైన హామీ ఇవ్వలేనని పేర్కొన్నారు. సంబంధిత విశ్వవిద్యాలయాలు విద్యార్థులతో మాట్లాడి.. ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తాయన్నారు. విద్యార్థుల సహేతుకమైన డిమాండ్లను, ఆందోళనను సరైన దిశలో పరిష్కరిస్తాయని చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని