Corona: కరోనా.. రెండేళ్ల ఆయువును తినేసింది..!

తాజా వార్తలు

Updated : 23/10/2021 19:28 IST

Corona: కరోనా.. రెండేళ్ల ఆయువును తినేసింది..!

మహమ్మారితో తగ్గిన భారతీయుల ఆయుర్దాయం

ముంబయి: గత ఏడాదిన్నర కాలంగా ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారి దాదాపు అన్ని రంగాలను కుదిపేసింది. ఆర్థికంగా, సామాజికంగా కోట్లాది మంది జీవితాలపై తీవ్ర ప్రభావం చూపింది. అంతేనా, కొవిడ్‌ కారణంగా భారతీయుల ఆయుర్దాయం కూడా రెండేళ్లు తగ్గినట్లు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.

ముంబయిలోని ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ పాపులేషన్‌ స్టడీస్‌(ఐఐపీఎస్‌) ఈ అధ్యయనం చేపట్టింది. ఐఐపీఎస్‌ ప్రొఫెసర్‌ సూర్యకాంత్‌ యాదవ్‌ నేతృత్వంలో జరిగిన ఈ అధ్యయనంలో కరోనా కారణంగా భారతీయుల ఆయుష్షు రెండేళ్ల మేర తగ్గినట్లు వెల్లడైంది. 2019లో పురుషుల ఆయుర్దాయం 69.5ఏళ్లుగా ఉండగా.. 2020 నాటికి అది 67.5ఏళ్లకు పడిపోయిందని నివేదిక వెల్లడించింది. ఇక మహిళల ఆయుర్దాయం రెండేళ్ల క్రితం 72ఏళ్లుగా ఉండగా.. గతేడాది నాటికి 69.8 ఏళ్లకు తగ్గినట్లు పేర్కొంది.

దేశవ్యాప్తంగా జనన, మరణాలపై కొవిడ్‌ మహమ్మారి ప్రభావాన్ని పరిశీలిస్తూ ఈ అధ్యయనం చేపట్టారు. కొవిడ్‌ కారణంగా గతేడాది నుంచి లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా 35-69 మధ్య వయస్కులైన పురుషులే ఎక్కువగా మరణించినట్లు అధ్యయనం పేర్కొంది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని