close

తాజా వార్తలు

Published : 28/02/2021 00:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అక్కడ కల్తీ చేస్తే జీవితఖైదే..

భోపాల్‌: ఆహార కల్తీని అరికట్టేందుకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అక్కడ ఎవరైనా తినే పదార్థాలను కల్తీ చేసినట్లు తేలితే వారికి జీవితకాల శిక్ష విధించేలా చట్టాల్లో మార్పులు చేసింది. ఈ సవరణలకు రాష్ట్ర కేబినెట్‌ తాజాగా ఆమోదముద్ర వేసింది.

మధ్యప్రదేశ్‌లో ఆహార పదార్థాలను కల్తీ చేసిన నేరానికి గతంలో ఆరు నెలల జైలు శిక్ష ఉండేది. ఆ తర్వాత దాన్ని మూడేళ్లకు పెంచారు. అయితే ఈ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో శిక్షను జీవితఖైదుకు పెంచుతూ ఐపీసీ చట్టాల్లో సవరణలు చేశారు. ఇటీవల ఈ సవరణల గురించి రాష్ట్ర గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ అసెంబ్లీలో వెల్లడించారు. తాజాగా వీటిపై రాష్ట్ర కేబినెట్‌ కూడా ఆమోదముద్ర వేసింది. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా మాట్లాడుతూ.. ఇకపై ఆహార కల్తీకి పాల్పడితే జీవితకాలం జైల్లో ఉండాల్సిందేనని తెలిపారు. ఇలాంటి వారు నేరుగా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని, ఇంతకంటే పెద్ద నేరమేమీ ఉండదని ఆయన అన్నారు. అంతేగాక, గడువు ముగిసన పదార్థాలు విక్రయించినా కూడా శిక్ష పడుతుందని హెచ్చరించారు. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని