Lockdown: కర్ణాటకలో మరోసారి పొడిగింపు
close

తాజా వార్తలు

Updated : 03/06/2021 19:07 IST

Lockdown: కర్ణాటకలో మరోసారి పొడిగింపు

బెంగళూరు: రాష్ట్రంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి ఇంకా అదుపులోకి రాకపోవడంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగిస్టున్నట్టు సీఎం యడియూరప్ప ప్రకటించారు. ప్రస్తుతం కొనసాతున్న లాక్‌డౌన్‌ ఆంక్షలు ఈ నెల 14 ఉదయం 6గంటల వరకు అమలులో ఉంటాయని ఆయన స్పష్టంచేశారు. నిపుణుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.  బుధవారం పలువురు మంత్రులు, సీనియర్‌ ఉన్నతాధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి.. రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన చర్యలపై చర్చించారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగిస్తున్నట్టు గురువారం సాయంత్రం ప్రకటించారు. 

ఇప్పటివరకు 1.41కోట్ల టీకాలు పంపిణీ చేయగా.. జూన్‌ నెలలో 60లక్షల డోసులు పంపిణీ చేయనున్నట్టు సీఎం వెల్లడించారు. ఈ నెలాఖరు నాటికి 2కోట్ల డోసులు పంపిణీ పూర్తి చేస్తామని తెలిపారు. కర్ణాటక వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు మద్దతుగా నిలుస్తున్నందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతూ యడియూరప్ప ట్వీట్‌ చేశారు.

కర్ణాటక ప్రభుత్వం తొలుత ఏప్రిల్‌ 27 నుంచి 14 రోజలు పాటు ‘క్లోజ్‌ డౌన్‌’పేరిట పలు ఆంక్షలు అమలు చేసింది. అయితే, అప్పటికీ వైరస్‌ విజృంభణ తగ్గకపోవడంత మే 10 నుంచి 24వరకు లాక్‌డౌన్‌ను అమలుచేస్తున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత దాన్ని జూన్‌ 7వరకు పొడిగించింది. అయితే, రాష్ట్ర కొవిడ్‌ సాంకేతిక సలహా కమిటీ పాజిటివిటీ రేటు 5శాతం కన్నా తక్కువగాకు దిగిరావడం, కేసులు కూడా 5వేలకన్నా తక్కువకు వచ్చినప్పుడే ఆంక్షలు ఎత్తివేయాలని నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 

మరోవైపు, కర్ణాటకలో నిన్న ఒక్కరోజే 16,387 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 26,35,122 కేసులు నమోదు కాగా.. వారిలో 23,12,060మంది కోలుకున్నారు. 30,017మంది మరణించారు. ప్రస్తుతం దేశంలోనే అత్యధికంగా 2,93,045 క్రియాశీల కేసులు ఉన్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని