చివరి నిమిషంలో రైలు ఆపాడు

తాజా వార్తలు

Published : 19/07/2021 01:04 IST

చివరి నిమిషంలో రైలు ఆపాడు

ముంబయి: మహారాష్ట్రలో ఓ రైలు డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో ఓ వృద్ధుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ముంబయిలోని కళ్యాణ్ ప్రాంతంలో ఆదివారం ఓ వృద్ధుడు పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ముంబయి-వారణాసి రైలు వేగంగా వస్తోంది. దీంతో రైల్వే స్టేషన్‌లో ఉన్న ఓ అధికారి లోకోపైలట్‌కు సమాచారం అందించాడు. దీంతో లోకోపైలట్‌ చాకచక్యంగా వ్యవహరించి అత్యవసర బ్రేకులు వేశాడు. అయితే రైలు ఆగినప్పటికీ ఆ వృద్ధుడు రైలు కింద పడ్డాడు. అనంతరం రైల్వే సిబ్బంది రైలు కింద ఇరుక్కున్న వృద్ధుడిని బయటకు తీయగా అతడికి స్వల్ప గాయాలు అయ్యాయి. వృద్ధుడికి ప్రాణపాయం తప్పడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. సెంట్రల్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ అలోక్‌ కన్సాల్ వృద్ధుడిని రక్షించిన ముగ్గురు సిబ్బందికి నగదు రివార్డ్‌ ప్రకటించారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని