లోక్‌సభ మార్చి 8కి వాయిదా 
close

తాజా వార్తలు

Published : 13/02/2021 20:14 IST

లోక్‌సభ మార్చి 8కి వాయిదా 

దిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో భాగమైన తొలి విడత లోక్‌సభ సమావేశాలు నేటితో ముగిశాయి. రెండో విడత సమావేశాలు మార్చి 8న ప్రారంభం కానున్నాయి. తొలి విడత సెషన్‌లో రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించగా.. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ -2021-22ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మార్చి 8న సాయంత్రం 4గంటలకు ప్రారంభం కానున్న రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు ఏప్రిల్‌ 8తో ముగియనున్నాయి. 

కొవిడ్‌ నిబంధనల కారణంగా ఉభయ సభలను వేర్వేరు షిప్టుల్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాజ్యసభ నిన్ననే వాయిదా పడటంతో లోక్‌సభ ఈ రోజు ఉదయం 10గంటలకే ప్రారంభమైంది. ప్రస్తుత సమావేశాల్లో రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్‌సభ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యకలాపాలను కొనసాగిస్తూ వచ్చాయి.

ఇదీ చదవండి..

JKకు తగిన సమయంలో రాష్ట్రహోదా: అమిత్‌ షా


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని