లోక్‌సభ.. రాజ్యసభ.. ఇకపై సంసద్‌ టీవీలో
close

తాజా వార్తలు

Updated : 02/03/2021 13:18 IST

లోక్‌సభ.. రాజ్యసభ.. ఇకపై సంసద్‌ టీవీలో

దిల్లీ: పార్లమెంట్‌ ఉభయ సభలకు ఇకపై ఓకే టీవీ ఛానల్‌ ఉండనుంది. లోక్‌సభ, రాజ్యసభ ఛానళ్లను కలిపేసినట్లు ఎగువసభ సచివాలయం సోమవారం రాత్రి బులిటెన్‌ విడుదల చేసింది. ఇకపై సంసద్‌ టీవీ పేరుతో ఉభయసభల కార్యకలాపాలను కొనసాగించనున్నట్లు తెలిపింది. రెండు సభల టీవీ ఛానళ్లను కలిపివేయడంపై గతేడాది జూన్‌లోనే నిర్ణయం తీసుకోగా.. తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది. సంసద్‌లో రెండు సభల కోసం రెండు శాటిలైట్‌ ఛానళ్లను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. 

కొత్త ఛానల్‌కు విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రవి కపూర్‌ను సీఈవోగా నియమించారు. ఈ పదవిలో ఆయన ఏడాదిపాటు కొనసాగనున్నారు. ప్రస్తుతం రాజ్యసభ టీవీ సీఈవోగా ఉన్న మనోజ్‌ కుమార్‌ పాండేను బాధ్యతల నుంచి విడుదల చేశారు. 1986 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన రవి కపూర్‌ జౌళిశాఖ కార్యదర్శిగా పనిచేశారు. 2016-19 మధ్య అసోం అదనపు ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. అంతకుముందు వాణిజ్య, పరిశ్రమలశాఖలో సంయుక్త కార్యదర్శిగా వ్యవహరించారు. వరల్డ్‌ బ్యాంక్‌, యూరోపియన్‌ యూనియన్‌, ఐక్యరాజ్యసమితిలోనూ పనిచేశారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని