లోక్‌సభలో విపక్షాల ఆందోళన.. మళ్లీ వాయిదా
close

తాజా వార్తలు

Published : 04/02/2021 17:30 IST

లోక్‌సభలో విపక్షాల ఆందోళన.. మళ్లీ వాయిదా

దిల్లీ: పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా వరుసగా మూడోరోజు లోక్‌సభలో వాయిదాల పర్వం కొనసాగింది. గురువారం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు మళ్లీ వ్యవసాయ చట్టాలపై ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీకర్‌ వారించినా విపక్ష ఎంపీలు వెనక్కి తగ్గకపోవడంతో సభ పలుమార్లు వాయిదా పడింది.

సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కాగానే సాగు చట్టాలను రద్దు చేయాలంటూ ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్‌ పోడియం వద్దకు వచ్చి ప్లకార్డులతో నినాదాలు చేశారు. విపక్షాల ఆందోళనల నడుమ స్పీకర్‌ ప్రశ్నోత్తరాల సమయాన్ని మొదలుపెట్టారు. ఓవైపు ఎంపీలు నినాదాలు చేస్తున్నా.. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ రెండు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. దీంతో సభను సజావుగా సాగనివ్వాలని స్పీకర్‌ కోరారు. అయినప్పటికీ వారు ఆందోళన ఆపకపోవడంతో సభను 45 నిమిషాల పాటు వాయిదా వేశారు.

అనంతరం తిరిగి 5 గంటలకు సభ ప్రారంభమైనా.. ప్రతిపక్ష సభ్యులు ఆందోళన ఆపలేదు. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని, రైతులకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. వారి ఆందోళన నడుమే స్పీకర్‌ ప్రశ్నోత్తరాల గంటను కొనసాగించారు. దీంతో విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. ప్లకార్డులు చూపిస్తూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో సభ మళ్లీ వాయిదా పడింది. నిరసనల మధ్య మధ్యవర్తిత్వ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు.

ఇవీ చదవండి..

గాజీపుర్‌కు విపక్ష బృందం.. అడ్డుకున్న పోలీసులు

సాగు చట్టాలపై భారత్‌కు అమెరికా మద్దతు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని