అవినీతి ఆరోపణలు.. దేశ్‌ముఖ్‌ వీడియో మెసేజ్‌ 

తాజా వార్తలు

Published : 23/03/2021 10:50 IST

అవినీతి ఆరోపణలు.. దేశ్‌ముఖ్‌ వీడియో మెసేజ్‌ 

ముంబయి: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా ఆరోపణలు వచ్చిన సమయం అయిన ఫిబ్రవరిలో దేశ్‌ముఖ్‌ ఎక్కడున్నారన్నదానిపై ఎన్సీపీ, భాజపా నేతల మధ్య మాటలయుద్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో హోంమంత్రి ట్విటర్‌ వేదికగా స్పందించారు. భాజపా ఆరోపణలను ఖండించారు. 

ఫిబ్రవరి మధ్యలో సచిన్‌ వాజేను దేశ్‌ముఖ్‌ ముంబయిలోని తన అధికారిక నివాసానికి పిలిపించుకున్నారని మాజీ కమిషనర్‌ పరమ్‌వీర్‌ తన లేఖలో పేర్కొనగా.. దీన్ని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ కొట్టిపారేశారు. ఆ సమయంలో దేశ్‌ముఖ్‌కు కరోనా సోకడంతో నాగ్‌పూర్‌లోని ఆసుపత్రిలో ఉన్నారని చెప్పారు. అయితే ఎన్సీపీ వాదనను భాజపా నేతలు తోసిపుచ్చారు. ఫిబ్రవరి 15న దేశ్‌ముఖ్‌ మీడియా సమావేశంలో మాట్లాడారని ట్వీట్‌ చేస్తూ.. దానికి సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేశారు. ఈ వీడియో బయటకు రాగానే.. ఫిబ్రవరి 15న నాగ్‌పూర్‌ నుంచి ముంబయికి ఓ ప్రైవేటు విమానంలో దేశ్‌ముఖ్‌ వచ్చినట్లు ఆయన పేరుతో ఓ విమాన టికెట్‌ సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యింది. 

ఈ పరిణామాలపై దేశ్‌ముఖ్‌ ట్విటర్‌ వేదికగా బదులిచ్చారు. ‘‘గతేడాది మహమ్మారి సమయంలో నేను రాష్ట్రమంతటా తిరుగుతూ పోలీసులను కలిసిన విషయం మీకు తెలిసిందే. విపత్కర సమయంలో వారిలో ధైర్యాన్ని పెంచేందుకే నేను సమావేశమయ్యా. ఫిబ్రవరి 5న నాకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో అప్పటి నుంచి 15 వరకు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నా. డిశ్చార్జ్‌ తర్వాత 10 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. అందువల్ల  ఓ ప్రైవేటు విమానంలో ముంబయికి వచ్చా. వైద్యుల సూచనలతో రోజూ రాత్రి ప్రాణాయామ కోసం పార్క్‌కు వెళ్లాను. నాగ్‌పూర్‌లోని ఆసుపత్రిలో ఉన్నప్పుడు, ముంబయికి వచ్చాక కూడా నేను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానే సమావేశాలకు హాజరయ్యా. ఫిబ్రవరి 28న తొలిసారి ఇంటి నుంచి బయటకు వచ్చా’’ అని దేశ్‌ముఖ్‌ వివరించారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని