మహారాష్ట్రలో బోర్డు పరీక్షలు వాయిదా
close

తాజా వార్తలు

Published : 12/04/2021 16:03 IST

మహారాష్ట్రలో బోర్డు పరీక్షలు వాయిదా

ముంబయి: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలలో జరగబోయే 10, 12వ తరగతి బోర్డు పరీక్షలను వాయిదా వేసింది. 10వ తరగతి వార్షిక పరీక్షలు జూన్‌లో, 12వ తరగతి పరీక్షలు మే నెలలో నిర్వహించనున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్ష గైక్వాడ్‌ సోమవారం ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. 

‘‘ప్రస్తుతం మహారాష్ట్రలో నెలకొన్న కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా 10, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నాం. ఇప్పుడు పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదు. మీ ఆరోగ్యమే మా ప్రాధాన్యం’’ అని వర్ష ట్వీట్ చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, రాజకీయ నేతలతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వైరస్‌ పరిస్థితులను సమక్షించిన అనంతరం పరీక్షల తుది తేదీలను ప్రకటిస్తామని ఆమె వెల్లడించారు. అంతేగాక, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ, కేంబ్రిడ్జ్‌ బోర్డులు కూడా పరీక్షలపై పునఃపరిశీలనలు జరపాలని ఆమె ఈ సందర్భంగా ఆయా బోర్డులను కోరారు. 

సీఎం వరుస సమావేశాలు..

మరోవైపు రాష్ట్రంలో వైరస్‌ ఉద్ధృతిపై ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నేడు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొవిడ్‌ విజృంభణ విపరీతంగా ఉన్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించాలని ఠాక్రే సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. బుధవారం దీనిపై ప్రకటన వెలువడే అవకాశాలు కన్పిస్తున్నాయి. కొవిడ్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ మినహా మరో ప్రత్యామ్నాయం లేదని శివసేన అధికారిక పత్రిక సామ్నా తన సంపాదకీయంలో పేర్కొన్న విషయం తెలిసిందే. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని