Black fungus: 5,500 కేసులు.. 126 మరణాలు

తాజా వార్తలు

Updated : 21/05/2021 18:17 IST

Black fungus: 5,500 కేసులు.. 126 మరణాలు

దిల్లీ: ఓ వైపు దేశమంతా కరోనా మహమ్మారితో అల్లాడుతున్న వేళ ఫంగస్‌ వ్యాధి భయపెడుతోంది. రోజురోజుకీ బ్లాక్‌ ఫంగస్‌(మ్యుకర్‌ మైకోసిస్‌) కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు 5,500 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదుకాగా.. 126 మంది చనిపోయినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇక కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలోనే ఈ ఫంగస్‌ కేసులు కూడా అత్యధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 90 మరణాలు సంభవించాయి. 

ఆ తర్వాత హరియాణాలో 14 మంది, ఉత్తరప్రదేశ్‌లో 8 మంది, ఝార్ఖండ్‌లో నలుగురు, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లో ఇద్దరు చొప్పున బ్లాక్‌ ఫంగస్‌తో మరణించారు. కొన్ని రాష్ట్రాలు ఈ ఫంగస్‌ కేసులు, మరణాలను నమోదు చేయకపోవడంతో ఇంకా పూర్తి సంఖ్య స్పష్టంగా తెలియడం లేదని సదరు కథనాలు పేర్కొన్నాయి. 

మరోవైపు బ్లాక్‌ఫంగస్‌ ఉద్దృతమవుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు దీన్ని అంటువ్యాధిగా ప్రకటించాలని, రోగులకు అత్యవసర చికిత్స అందించాలని కేంద్రం నిన్న ఆదేశించింది. అటు కేసులు పెరుగుతుండటంతో ఈ వ్యాధిని అదుపు చేసేందుకు ఉపయోగించే లిపోసోమల్‌ యాంపొటెరిసిన్‌ బి ఇంజెక్షన్‌ ఔషధం కొరత ఏర్పడుతోంది. ప్రస్తుతం ఈ మందుల కొరతను అధిగమించేందుకు మరో 5 కంపెనీలకు అనుమతులిచ్చినట్లు కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని