మహారాష్ట్ర: నెలలో 6 లక్షల కొత్త కేసులు..

తాజా వార్తలు

Updated : 01/04/2021 19:42 IST

మహారాష్ట్ర: నెలలో 6 లక్షల కొత్త కేసులు..

ముంబయి: దేశంలో కరోనా సెకండ్ వేవ్‌ విజృంభిస్తోంది. అయితే దేశవ్యాప్తంగా నమోదవుతోన్న కొత్త కేసుల్లో సగానికిపైగా మహారాష్ట్రలోనే రావడం కలవరపెడుతోంది. కేవలం మార్చి నెలలోనే రికార్డు స్థాయిలో 6 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. కాగా మార్చిలో కరోనా ఉగ్రరూపం దాల్చడంతో అన్ని రకాల వయసుల వారూ వైరస్‌ బారిన పడ్డట్లు తెలిపింది. ఇందులో 31 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు వారిలో 1.34(22 శాతం) లక్షల మందికి పాజిటివ్ రాగా, 10-15 ఏళ్ల మధ్య పిల్లల్లో 500 కొత్త కేసులు నమోదయినట్లు ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

గత సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఏడాది అధిక సంఖ్యలో చిన్నారులు కరోనా బారిన పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో తల్లిదండ్రుల నుంచి కూడా పిల్లలకు వైరస్ వ్యాపిస్తోందని వారు వివరించారు. బహిరంగ ప్రదేశాల్లో, ఆట మైదానాల్లో చిన్నారులు కరోనా జాగ్రత్తలు తీసుకోవడం లేదని అధికారులు భావిస్తున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా కేవలం మార్చిలోనే లక్షకుపైగా యువకులు(21-30) వైరస్‌ బారినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు 11-20 ఏళ్ల మధ్య వారిలో 40 వేల మందికి పాజిటివ్‌ వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని