నాగ్‌పూర్‌లో లాక్‌డౌన్ 

తాజా వార్తలు

Updated : 11/03/2021 17:07 IST

నాగ్‌పూర్‌లో లాక్‌డౌన్ 

అత్యవసర సేవలు కొనసాగుతాయన్న ప్రభుత్వం

ముంబయి: మహారాష్ట్రలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దాంతో దాని కట్టడికి ప్రభుత్వం కఠిన ఆంక్షలవైపు మొగ్గుచూపాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. తాజాగా నాగ్‌పూర్‌ జిల్లాలో ఏడురోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

‘మార్చి 15 నుంచి 21 వరకు నాగ్‌పూర్ సిటీ పోలీస్‌ కమిషనరేట్ ప్రాంతం పూర్తిస్థాయి లాక్‌డౌన్ పరిధిలోకి వెళ్లనుంది’ అని మంత్రి నితిన్ రౌత్ వెల్లడించారు. అత్యవసర సేవలకు మాత్రం ఏ అంతరాయం ఉండదని తెలిపారు. తాజా కరోనా విజృంభణతో మహారాష్ట్ర ప్రభుత్వం సతమతమవుతోంది. ఫిబ్రవరి రెండో వారం నుంచి పెరుగుతున్న రోజూవారీ కేసులు..కొద్ది రోజులుగా 10వేలకు పైగా నమోదవుతున్నాయి. బుధవారం ఆ సంఖ్య 13,659కి చేరింది. ఈ ఏడాదిలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ప్రధాన నగరాలైన ముంబయిలో 1,539, పుణెలో 1,384, నాగ్‌పూర్‌లో 1,513, నాసిక్‌లో 750, యావత్మల్‌లో 403, ఔరంగాబాద్‌లో 560, పింప్రిచించ్వాడ్‌లో 590 కరోనా కేసులు వెలుగుచూశాయి. 

కరోనాను కట్టడిచేసేందుకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఏడు పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. వేగవంతమైన కాంటాక్ట్ ట్రేసింగ్, హాట్‌ స్పాట్స్‌లో మాస్‌ టెస్టింగ్, వైరస్ సోకినవారి సన్నిహితులను పరీక్షించడం వంటివి ఆ ప్రణాళికలో భాగం. అన్ని జిల్లా యంత్రాంగాలు వాటిని పాటించాలని ఇదివరకే ఆరోగ్య శాఖ ఆదేశించింది.

రానున్న రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతిని కట్టడి చేసేందుకు కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ‘రానున్న రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించనున్నాం. ప్రస్తుతానికి రాష్ట్రంలో కరోనా పరిస్థితులు ఇంకా అదుపుతప్పలేదు. కొన్ని ప్రాంతాల్లో కఠినమైన లాక్‌డౌన్ నిబంధనలు విధిస్తాం. వాటిపై నిర్ణయం తీసుకోనున్నాం’ అని ఆయన అన్నారు. ముంబయిలోని జేజే ఆసుపత్రిలో టీకా మొదటి డోసు తీసుకున్న అనంతరం ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. టీకా తీసుకునేందుకు ఎవరు సంకోచించవద్దని..అర్హులంతా టీకా తీసుకోవాలని ఆయన సూచించారు. వైద్య సిబ్బంది ఆయనకు కొవాగ్జిన్ టీకా ఇచ్చారు.

ఆరు రాష్ట్రాలు..85.91 శాతం కేసులు..

దేశంలో వెలుగుచూస్తోన్న రోజువారీ కేసుల్లో ఎక్కువ భాగం..మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, కర్ణాటక, గుజరాత్, తమిళనాడులోనే నమోదు కావడం గమనార్హం. తాజా కేసుల్లో 85.91 శాతం కేసులు ఈ రాష్ట్రాల్లోనే వెలుగుచూశాయని గురువారం కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 22,854 కొత్త కేసులు వెలుగుచూశాయని తెలిపింది. సుమారు రెండు నెలల తరవాత ఈ స్థాయి కేసులు బయటపడ్డాయి. 126 మంది మృత్యుఒడికి చేరుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని