ఆ విషయంలో భారత్‌ది ఓ విజయగాథ: బ్లింకెన్‌

తాజా వార్తలు

Published : 21/01/2021 02:13 IST

ఆ విషయంలో భారత్‌ది ఓ విజయగాథ: బ్లింకెన్‌

వాషింగ్టన్‌ : అమెరికాతో భారత్‌ కొనసాగిస్తున్న సంబంధాలపై ఆ దేశానికి కాబోయే విదేశాంగ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్‌ ప్రశంసలు కురిపించారు. అమెరికాలో ఏ పార్టీ అధికారంలో ఉందన్న దానితో సంబంధం లేకుండా(ఉభయతారకం) భారత్‌ అగ్రరాజ్యంతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో భారత్‌ది ఓ విజయగాథగా చెప్పుకోవచ్చని అభిప్రాయపడ్డారు. పరోక్షంగా ట్రంప్‌ ప్రభుత్వంతో ఇండియా వ్యవహరించిన తీరును కూడా ఆయన ఆమోదించారు. భవిష్యత్తులోనూ ఇరు దేశాల మధ్య మైత్రి కొనసాగాలని ఆకాంక్షించారు. విదేశాంగ సెక్రటరీగా సెనేట్‌ కమిటీ ఆయనకు ఆమోదముద్ర వేసే ముందు బ్లింకెన్‌ మాట్లాడుతూ భారత్‌పై తన దృక్పథాన్ని ఆవిష్కరించారు.

ఒబామా హయాంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడ్డాయని బ్లింకెన్‌ గుర్తుచేశారు. సమాచార మార్పిడి, రక్షణ ఉత్పత్తుల కొనుగోళ్ల విషయంలో కొత్త ఒప్పందాలు కుదిరాయన్నారు. ఈ పరంపరను ఇండో-పసిఫిక్‌ వ్యూహాన్ని ఆవిష్కరిస్తూ ట్రంప్‌ కొనసాగించారని తెలిపారు. ప్రాంతీయంగా భారత్‌ సార్వభౌమాధికారంపై చైనా సహా ఇతర ఏ శక్తులు సవాల్‌ విసరకుండా కృషి చేస్తున్నామని తెలిపారు. అలాగే ఉగ్రవాద నిర్మూలనపైనా ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయన్నారు.

ఇంకా అనేక రంగాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేసేందుకు అవకాశాలు ఉన్నాయని బ్లింకెన్‌ తెలిపారు. ముఖ్యంగా వాతావరణ మార్పుల విషయంలో ఎంతో పురోగతి సాధించాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ పునరుత్పాదక ఇంధనం సహా ఆధునిక సాంకేతికతను ప్రోత్సహిస్తున్నారని గుర్తుచేశారు. 

గత ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగానూ బ్లింకెన్‌ ఇరు దేశాల మధ్య సత్సంబంధాల కొనసాగింపు ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఎన్నికలకు ముందే భారత్‌ పట్ల తమ వైఖరి ఏంటో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఉభయ దేశాల మధ్య బైడెన్ బలమైన సంబంధాల్ని కోరుకుంటున్నారని గుర్తుచేశారు. 2020లో ప్రపంచంలోనే అత్యంత సన్నిహిత దేశాలుగా భారత్‌-అమెరికా అవతరించనున్నాయని బైడెన్ 2006లోనే అంచనా వేసినట్లు తెలిపారు.

ఇవీ చదవండి...

ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్‌

మళ్లీ అ‘మెరిక’ను చేయాలని..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని