విద్యార్థులకు క్రెడిట్‌ కార్డులు.. ప్రారంభించిన దీదీ

తాజా వార్తలు

Published : 30/06/2021 17:56 IST

విద్యార్థులకు క్రెడిట్‌ కార్డులు.. ప్రారంభించిన దీదీ

కోల్‌కతా: విద్యార్థులకు రుణ సదుపాయం కల్పించేలా ‘స్టూడెంట్‌ క్రెడిట్‌ కార్డు’ పథకాన్ని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బుధవారం ఆమె కోల్‌కతాలో ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా దీదీ మాట్లాడుతూ.. విద్యార్థులకు క్రెడిట్‌ కార్డు పథకాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. బెంగాల్ యువత స్వావలంబన కోసం వార్షిక సాధారణ వడ్డీతోనే రూ.10 లక్షల వరకు రుణం అందించనున్నట్టు చెప్పారు. బెంగాల్‌కు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యా సంస్థల్లో చేరినవారితో పాటు కోచింగ్‌ సెంటర్లలో పరీక్షలకు సన్నద్ధమవుతున్న అందరికీ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చినహామీలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం అవిశ్రాంతంగా పని చేస్తోందని పేర్కొన్నారు. 

పశ్చిమ బెంగాల్ నుంచి ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులను మరింతగా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్టూడెంట్‌ క్రెడిట్‌ లాంటి సమగ్రమైన పథకాన్నిఅమలు చేయాలని గతంలో నిర్ణయించిందని విద్యాశాఖకు చెందిన ఓ సీనియర్‌ అధికారి తెలిపారు.  15 ఏళ్లలో తిరిగి చెల్లించే కాల పరిమితితో చాలా నామమాత్రపు వార్షిక సాధారణ వడ్డీ రేటుతో రూ.10లక్షలు రుణం ఇస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ‘స్టూడెంట్‌ క్రెడిట్‌ కార్డు పథకం’ అమలు చేస్తామని తృణమూల్‌ కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రెడిట్‌ కార్డు ద్వారా 4 శాతం వడ్డీతో రూ.10 లక్షల వరకు విద్యార్థులకు రుణాలు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని