ఓ వైపు మోదీ.. మరోవైపు దీదీ!
close

తాజా వార్తలు

Published : 07/03/2021 18:50 IST

ఓ వైపు మోదీ.. మరోవైపు దీదీ!

గ్యాస్‌ ధరలపై భారీ నిరసన ప్రదర్శన

దిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల వేడి మొదలైంది. ఓ వైపు భారతీయ జనతా పార్టీ ఎన్నికల శంఖారావం పూరించగా.. అదే రోజు పెరిగిన ఎల్‌పీజీ గ్యాస్‌ ధరలను నిరసిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధ్యక్షతన తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆదివారం భారీ పాదయాత్ర నిర్వహించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోల్‌కతాలో భారీ బహిరంగ సమావేశం చేపట్టగా.. మరోవైపు సిలిగురిలో దీదీ భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రంపై మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. 

సోనార్‌ బంగ్లా (బంగారు బంగ్లా) గురించి మాట్లాడే మోదీ.. సోనార్ ఇండియా గురించి, పెరిగిన గ్యాస్ గురించి ఎందుకు మాట్లాడరని మమత ప్రశ్నించారు. ఎయిరిండియా నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ వరకూ అన్నింటినీ అమ్మేశారని విమర్శించారు. ఎన్నికల ముందు ‘ఉజ్వల’ (ఉచిత గ్యాస్‌ పథకం) గురించి మాట్లాడే మోదీ.. ఎన్నికల తర్వాత పలికేవి అన్నీ ‘జుమ్లాలే’ (అబద్ధాలు) అని విమర్శించారు. కొవిడ్‌ సమయంలో రాష్ట్రం గురించి పట్టించుకోని ఆయన.. వ్యాక్సిన్‌ సర్టిఫికెట్లపై ఇప్పుడు తన చిత్రం వేయించుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇక్కడి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ఆయన అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీఎంసీ ఎంపీలు చక్రవర్తి, నుస్రాత్‌ జహాన్‌, ఇతర నాయకులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని