Corona: 130 రోజుల తర్వాత కొవిడ్‌ నుంచి కోలుకుని..

తాజా వార్తలు

Published : 16/09/2021 14:10 IST

Corona: 130 రోజుల తర్వాత కొవిడ్‌ నుంచి కోలుకుని..

(ప్రతీకాత్మక చిత్రం)

మేరఠ్‌: కరోనా రెండో దశ ఉద్ధృతి సయమంలో మహమ్మారి బారిన పడిన ఓ వ్యక్తి.. వైరస్‌తో సుదీర్ఘంగా పోరాడి విజయం సాధించారు. 130 రోజుల తర్వాత కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. తన కళ్లముందే ఎంతోమంది కరోనా బాధితులు చనిపోతున్నా.. మనోధైర్యంతో వైరస్‌ను జయించగలిగారు. 

ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌కు చెందిన 39ఏళ్ల విశ్వాస్‌ సైనీకి ఈ ఏడాది ఏప్రిల్‌ 28న కరోనా పాజిటివ్‌గా తేలింది. తొలుత ఇంట్లోనే స్వీయనిర్బంధంలో ఉన్నారు. అయితే ఆ తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించడంతో స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. వైరస్‌ సోకిన తొలినాళ్లలో ఆయన ఆక్సిజన్‌ స్థాయి 16కు పడిపోయాయి. దీంతో దాదాపు నెలరోజులు వెంటిలేటర్‌పై ఉన్నారు. అయినప్పటికీ మనోధైర్యం కోల్పోలేదు. అలా ఏకంగా 130 రోజుల పాటు వైరస్‌తో పోరాడి చివరకు విజయం సాధించారు. బుధవారం ఆయన డిశ్చార్జ్‌ అయినట్లు ఆసుప్రతి వర్గాలు తెలిపాయి. 

ఈ సందర్భంగా విశ్వాస్‌ మాట్లాడుతూ.. ‘‘ఇన్ని రోజుల తర్వాత కోలుకుని ఇంటికి రావడం, మళ్లీ నా కుటుంబసభ్యులతో గడపడం ఎంతో ఆనందగా ఉంది. హాస్పిటల్‌లో ఉన్నప్పుడు నా కళ్లముందే చాలా మంది కొవిడ్‌ బాధితులు చనిపోయారు. దీంతో నేను కూడా ఒకింత ఆందోళనకు గురయ్యా. అయితే, వైద్యులు నాలో ఆత్మవిశ్వాసం నింపారు. ఆరోగ్యంపై దృష్టిపెట్టమని చెప్పారు. నేను కూడా ధైర్యం తెచ్చుకున్నా. అలా కొవిడ్‌ను జయించగలిగా’’ అని చెప్పుకొచ్చారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని