Corona: ఆఖరి మజిలీలో అన్నీ తానై.. ఇప్పుడు 

తాజా వార్తలు

Published : 19/05/2021 01:22 IST

Corona: ఆఖరి మజిలీలో అన్నీ తానై.. ఇప్పుడు 

హిస్సార్‌: కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వందల మందికి అన్నీ తానై అంత్యక్రియలు జరిపించిన ఓ అధికారి.. చివరకు అదే మహమ్మారికి బలయ్యారు. హరియాణాలోని హిస్సార్‌లో కొవిడ్ మృతులకు అంత్యక్రియలు నిర్వహించేందుకు అక్కడి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఓ అధికారుల బృందాన్ని ఏర్పాటుచేసింది. ప్రవీణ్‌ కుమార్‌ అనే మున్సిపల్‌ అధికారి దీనికి ప్రాతినిధ్యం వహించారు. గతేడాది నుంచి ఇప్పటివరకు దాదాపు 300 మంది కరోనా మృతులకు ఆయనే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. 

అయితే రెండు రోజుల క్రితం ప్రవీణ్‌కు కరోనా సోకింది. ఆక్సిజన్‌ స్థాయులు పడిపోవడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ నిన్న రాత్రి ఆయన తుదిశ్వాస విడిచినట్లు మున్సిపల్‌ కార్పొరేషన్ అధికార ప్రతినిధి తెలిపారు.  వైరస్‌ సోకిన కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం విచారకరం.

దేశవ్యాప్తంగా కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కొత్త కేసుల్లో కాస్త తగ్గుదల కన్పిస్తున్నప్పటికీ మరణాలు రికార్డు స్థాయిలో ఉంటుండం ఆందోళన కలిగిస్తోంది. తొలి దశతో పోలిస్తే రెండో దశలో యువత కూడా ఎక్కువ సంఖ్యలో వైరస్‌కు బలవుతున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని