Mankind: వారికి రూ.100కోట్లు సాయం

తాజా వార్తలు

Updated : 26/04/2021 17:44 IST

Mankind: వారికి రూ.100కోట్లు సాయం

ఇంటర్నెట్‌ డెస్క్: దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్న తరుణంలో ప్రముఖులు తమ వంతు సాయం అందిస్తున్నారు. తాజాగా ఫార్మా సంస్థ మ్యాన్‌కైండ్‌ కరోనా మహమ్మారితో పోరాడి మరణించిన వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు, ఫార్మాసిస్టుల కుటుంబాలకు 100 కోట్ల రూపాయలు విరాళం ఇస్తున్నట్లు ట్విటర్‌ ద్వారా ప్రకటించింది. సంబంధిత వర్గాల వారికి మూడు నెలల్లో మొత్తం సొమ్మును అందించేందుకు ఫార్మా సంస్థ ఏర్పాట్లు చేస్తోంది.

ఈ సందర్భంగా మ్యాన్‌కైండ్‌ ఫార్మా మేనేజింగ్‌ డైరెక్టర్‌, వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ జునేజా మాట్లాడుతూ.. ‘‘మహమ్మారితో పోరాటంలో ప్రజలకు రక్షణగా నిలుస్తున్న ఎంతో మంది వైరస్‌ సోకి మరణించారు. వాళ్లందరికీ నివాళిగా రూ.100 కోట్ల విరాళాన్ని అందజేస్తున్నాము. ఇది మా కర్తవ్యంగా భావిచండం లేదు. వాళ్లకు రుణపడి చేస్తున్న పని అనుకుటున్నాం. వాళ్ల స్థానాన్ని భర్తీ చేయలేం. కానీ, ఈ పరిస్థితుల్లో వాళ్ల కుటుంబాలకు సాయం మాత్రం చేయగలం’’ అని అన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని