close

తాజా వార్తలు

Updated : 14/01/2021 16:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘సుప్రీం’ కమిటీ నుంచి తప్పుకొంటున్నా..! 

చండీగఢ్‌: మూడు వ్యవసాయ చట్టాలపై రైతులతో చర్చల కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల కమిటీ నుంచి తప్పుకొంటున్నట్టు భారతీయ కిసాన్‌ సంఘం (బీకేయూ) అధ్యక్షుడు భూపీందర్‌సింగ్‌ మాన్‌ ప్రకటించారు. ఈ ప్యానల్‌ నుంచి తనకు తానుగా తప్పుకొంటున్నానన్నారు. ఈ కమిటీలో సభ్యుడిగా నామినేట్‌ చేసినందుకు సర్వోన్నత న్యాయస్థానికి కృతజ్ఞతలు తెలిపిన మాన్‌.. రైతుల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు. ఎలాంటి పదవినైనా త్యాగం చేసేందుకు సిద్ధమేనన్నారు. 

వివాదాస్పదంగా మారిన మూడు వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు మంగళవారం స్టే విధించిన విషయం తెలిసిందే. రైతులతో సంప్రదింపులు జరిపేందుకు అనిల్‌ ఘన్వాట్‌, అశోక్‌ గులాటి, భూపీందర్‌సింగ్‌ మాన్‌, ప్రమోద్‌ కుమార్‌ జోషీలతో కూడిన కమిటీ నియమించింది. 10 రోజుల్లో తొలి సమావేశం నిర్వహించాలని సూచించింది. అయితే, ఈ కమిటీలోని నలుగురు సభ్యులూ సాగు చట్టాలకు అనుకూలురేనంటూ రైతు సంఘాలు, విపక్షాలు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తంచేశాయి. మరోవైపు, ఈ చట్టాలను పూర్తిగా రద్దుచేయాలని, అప్పటిదాకా తమ ఉద్యమాన్ని విరమించేది లేదని రైతుసంఘాల ప్రతినిధులు తెగేసి చెబుతున్న విషయం తెలిసిందే. 

ఇవీ చదవండి..

భోగి మంటల్లో సాగు చట్టాల ప్రతులు

సాగు చట్టాలపై స్టే

నలుగురూ మద్దతుదారులే!
 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని