6 రోజుల్లో 10లక్షల మందికి టీకా!

తాజా వార్తలు

Updated : 24/01/2021 17:14 IST

6 రోజుల్లో 10లక్షల మందికి టీకా!

ప్రపంచ వ్యాప్తంగా 6కోట్ల డోసుల పంపిణీ

దిల్లీ: ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ అత్యంత వేగంగా కొనసాగుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొదట వ్యాక్సినేషన్‌‌ ప్రారంభమైన అమెరికా, బ్రిటన్‌ దేశాలతో పోలిస్తే భారత్‌లో అతి తక్కువ సమయంలోనే పదిలక్షల మందికి టీకా ఇచ్చినట్లు తెలిపింది. కేవలం ఆరు రోజుల్లోనే పది లక్షల మందికి టీకా అందించామని.. ఆదివారం నాటికి ఈ సంఖ్య 16లక్షలకు చేరుకుందని ఆరోగ్యశాఖ పేర్కొంది.

భారత్‌ కంటే ముందే బ్రిటన్‌, అమెరికాలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభమయ్యింది. అయితే, పదిలక్షల మందికి టీకా ఇవ్వడానికి బ్రిటన్‌కు 18రోజుల సమయం పట్టగా, అమెరికాకు పదిరోజుల సమయం పట్టిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24గంటల్లో 2లక్షల మందికి టీకా‌ ఇవ్వగా, జనవరి 24 నాటికి దాదాపు 16లక్షలు(15,82,201) మందికి వ్యాక్సిన్‌ తొలి డోసు ఇచ్చినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్లపై వచ్చే వదంతులను నమ్మవద్దని, మీ సమయం వచ్చినప్పుడు టీకా తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ వెల్లడించారు.

మాకూ ప్రాధాన్యం ఇవ్వండి..
దేశంలో తొలిదశలో భాగంగా, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి తర్వాత వ్యాక్సిన్‌ పంపిణీలో తమకు ప్రాధాన్యత కల్పించాలని పౌర విమానయానశాఖలోని ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు టీకా‌ అందించాలని ఆ శాఖ కోరింది. వైరస్‌ ప్రమాదం పొంచివున్న విమాన సిబ్బంది, ఇంజినీర్లు, టెక్సీషియన్లు, గ్రౌండ్‌ స్టాఫ్‌, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ పంపిణీలో ప్రాధాన్యం కల్పించాలని పౌరవిమానయానశాఖ కార్యదర్శి ప్రదీప్‌ సింగ్‌ ఖరోలా ఇటీవలే ఆరోగ్యశాఖకు లేఖ రాశారు. తొలి దశలో దాదాపు కోటి మందికి టీకా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయగా, ఈ ఏడాది జులై నాటికి 30కోట్ల మందికి వ్యాక్సిన్‌ అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా 6కోట్ల మందికి..
కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 56 దేశాల్లో ప్రారంభం కాగా, ఇప్పటికే 6కోట్ల 30లక్షల మంది వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. విశ్వవ్యాప్తంగా నిత్యం సరాసరి 30లక్షల మందికి వ్యాక్సిన్‌ తీసుకుంటున్నారు. ఇక అమెరికాలో ఇప్పటి వరకు అత్యధికంగా 2 కోట్ల 10లక్షల మందికి వ్యాక్సిన్‌ అందించగా, ప్రతిరోజు దాదాపు పదిలక్షల టీకా డోసులను పంపిణీ చేస్తున్నట్లు సీడీసీ వెల్లడించింది. చైనాలోనూ భారీ ఎత్తున వ్యాక్సిన్‌ పంపిణీ చేపడుతున్నప్పటికీ వాటికి సంబంధించిన అధికారిక సమాచారం అందుబాటులో లేదు.

ఇవీ చదవండి..
భారత్‌ సహకారానికి కృతజ్ఞతలు:WHO
నిజమైన స్నేహానికి అర్థం భారత్‌: అమెరికాTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని