కరోనా ఉద్ధృతి: అమెరికా కీలక నిర్ణయం

తాజా వార్తలు

Updated : 24/02/2021 18:47 IST

కరోనా ఉద్ధృతి: అమెరికా కీలక నిర్ణయం

న్యూయార్క్‌: అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ బైడెన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్‌ కట్టడికి దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో మాస్కులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. అతి త్వరలోనే మాస్కుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఇందుకు ఎంత ఖర్చు కానుంది, ఎలాంటి మాస్కులు అందిస్తారనే విషయంపై శ్వేతసౌధం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 

అయితే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలోనే మాస్కులు పంపిణీ చేయాలని భావించినప్పటికీ అది అమలు కాలేదు. కాగా జో బైడెన్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక మొదటి వంద రోజులు ప్రతి ఒక్కరు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆయన కోరారు. ప్రజా రవాణా, కార్యాలయాల్లోనూ మాస్కులు ధరించడాన్ని బైడెన్‌ తప్పనిసరి చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని